Online Earning | చదువుతుండగానే ఆన్‌లైన్‌లో సంపాదన.. ఎలాగో తెలుసా?

Online Earning | చదువుతుండగానే ఆన్‌లైన్‌లో సంపాదన.. ఎలాగో తెలుసా?

విద్యార్థులు తమ చదువుకు ఆటంకం కలగకుండా ఖాళీ సమయంలో ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించేందుకు ప్రస్తుతం అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

Eenadu icon
By Education News Team Updated :05 Jan 2026 19:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విద్యార్థులు తమ చదువుకు ఆటంకం కలగకుండా ఖాళీ సమయంలో ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించేందుకు ప్రస్తుతం అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ డిజిటల్‌ ప్రపంచంలో ఆసక్తికి తోడు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు తోడైతే సంపాదనా మార్గాలకు కొదవ లేదు. ఎలాంటి పెట్టుబడి లేకుండానే డబ్బులు సంపాదించేందుకు ఉన్న కొన్ని మార్గాలివిగో! 

  • మీకు మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లిష్‌ వంటి సబ్జెక్టుల్లో మంచి పట్టు ఉందా? అయితే, పాఠశాల విద్యార్థులకు ఆయా సబ్జెక్టులను ఆన్‌లైన్‌లో బోధించే మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ ద్వారా పార్ట్‌టైంగా పనిచేసి డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. బోధించే గంటలను బట్టి డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకోసం  Chegg India, Vedantu, byjus వంటి వేదికలను ఉపయోగించుకోవచ్చు.
  • మీలో ఏదో ఒక నైపుణ్యం ఉంటే ఫ్రీలాన్సింగ్‌ ఓ మంచి ఆప్షన్‌. కంటెంట్ రైటింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ ద్వారా లోగోలు, పోస్టర్లను రూపొందించడం, కోడింగ్ రాయడం, వీడియో ఎడిటింగ్‌, డేటా ఎంట్రీ వంటి నైపుణ్యాలుంటే వాటి ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలు ఉన్నాయి. ఇందుకోసం Freelancer.in, upwork, fiverr వంటి వేదికలను పరిశీలించవచ్చు.

2026లో జాబ్‌ రావాలంటే.. ఈ నైపుణ్యాలు మీలో ఉన్నాయా?

  • మీ ఆసక్తిని బట్టి ఏదైనా అంశం (ఉదా: టెక్నాలజీ, వంటలు, విద్య, ట్రావెల్ తదితరాలు)పై ప్రత్యేకంగా వీడియోలు చేసి యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడం ద్వారా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. మీరు పోస్టు చేసే వీడియోలకు వచ్చే వ్యూస్‌, షేరింగ్‌ ఆధారంగా వీటికి కొంత మొత్తం వస్తుంది. 
  • కొందరికి ఏదైనా అంశంపై ఆర్టికల్స్ రాయడమంటే ఇష్టం. అలాంటివారు  పలువురు క్లయింట్ల కోసం వ్యాసాలు రాయడం, బ్లాగ్‌లు లేదా వెబ్‌సైట్‌కు కంటెంట్‌ని రాయడం వంటి మార్గాలను చూడొచ్చు.  చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు, కంటెంట్‌ క్రియేటర్లతో మాట్లాడి వారికి సంబంధించిన సోషల్‌ మీడియా ఖాతాలను నిర్వహించే పద్ధతిని కూడా పార్ట్‌టైం జాబ్‌గా ఎంచుకోవచ్చు. ఇది కూడా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే మార్గమే. 
  • విద్యార్థులు తమ హ్యాండ్‌రైటింగ్‌ లేదా డిజిటల్‌ స్టడీ నోట్సును ఆన్‌లైన్‌ వేదికలపై విక్రయించడం ద్వారా కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.  అలాగే, ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ సంబంధిత వర్క్‌ని కూడా ఎంచుకోవచ్చు. దీనికి ప్రత్యేక నైపుణ్యాలేమీ అవసరంలేదు.