CTET Provisional Key | సీటెట్ 2026 ప్రొవిజినల్ కీ విడుదల
సీబీఎస్‌ఈ (CBSE) నిర్వహించిన కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(CTET 2026) ప్రిలిమినరీ కీ విడుదలైంది.
By Education News Team
Updated :12 Mar 2026 21:14 IST
https://results.eenadu.net/education-news/ctet-2026-provisional-answer-key-released
ఇంటర్నెట్ డెస్క్: సీబీఎస్‌ఈ (CBSE) నిర్వహించిన కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(CTET 2026) ప్రిలిమినరీ కీ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో సీటెట్ నిర్వహించగా.. గురువారం సాయంత్రం ప్రిలిమినరీ కీ, ఓఎంఆర్ ఆన్సర్ షీట్‌లను అప్‌లోడ్ చేశారు. మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపవచ్చని సీబీఎస్‌ఈ అధికారులు సూచించారు. అభ్యర్థులు సీటెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి కీ, ఓఎంఆర్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రొవిజినల్ కీపై అభ్యంతరాల కోసం క్లిక్ చేయండి
అభ్యర్థులు లేవనెత్తే అభ్యంతరాల్లో ఒక్కో ప్రశ్నకు రూ.వెయ్యి చొప్పున (నాన్ రిఫండ్) చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ప్రాథమిక కీని పొందొచ్చు. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన అనంతరం ఈ నెలాఖరు వరకు తుది కీని రూపొందించి ఆ తర్వాత ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.