TG: 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు మెరిట్ జాబితా విడుదల
తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా వైద్య పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు) ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదలైంది.
By Education News Team
Updated :10 Mar 2026 19:24 IST
https://results.eenadu.net/education-news/telangana-govt-released-civil-assistant-surgeon-posts-merit-list
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా వైద్య పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు) ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదలైంది. ఈ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(MHSRB) మంగళవారం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు మార్చి 12 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని, ఈ నెలాఖరు నాటికి 692 మంది వైద్యులు ఉద్యోగాల్లో చేరతారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.
ప్రొవిజినల్ మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి
రాష్ట్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్)తో పాటు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టు (అనస్థీషియా, పీడియాట్రిక్) సహా పలు పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా 692 పోస్టుల భర్తీకి మెరిట్ జాబితాను విడుదల చేసింది. మార్చి 12, 13 తేదీల్లో హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు పేర్కొంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్‌ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచిన వెబ్‌నోటీస్‌లో వివరించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఫైనల్ మెరిట్ జాబితా, ఎంపిక జాబితాలను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.