UPSC Civils 2025| సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్ మార్కుల షీట్లు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి!
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు (UPSC CSE 2026 final Results) ఇటీవల వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా అభ్యర్థుల మార్కుల షీట్లను యూపీఎస్సీ విడుదల చేసింది.
By Education News Team
Updated :11 Mar 2026 20:42 IST
https://results.eenadu.net/education-news/upsc-cse-prelims-and-main-Marksheets-out
ఇంటర్నెట్ డెస్క్: యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు (UPSC CSE 2026 final Results) ఇటీవల వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అనూజ్ అగ్నిహోత్రి, రాజేశ్వరి సువే, ఆకాన్ష్ ధుల్ తొలి మూడు ర్యాంకులతో (Civils 2025 Toppers) మెరవగా.. పలువురు తెలుగు విద్యార్థులూ ఈ పరీక్షల్లో సత్తా చాటారు. గతేడాది యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు 9,37,876 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,76,793 మంది మాత్రమే హాజరయ్యారు. మెయిన్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ అనంతరం 958మందిని సర్వీసుల్లో నియామకాలకు యూపీఎస్సీ సిఫారసు చేసింది. ఈ క్రమంలో మార్చి 10న సివిల్స్ విజేతలు మెయిన్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల వివరాలను ప్రకటించిన UPSC అధికారులు.. ‘సివిల్స్’ రాసిన అభ్యర్థుల మార్కుల షీట్‌లను తాజాగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల షీట్లు
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాతో పాటు మెయిన్ పరీక్షకు సంబంధించిన మార్కుల షీట్‌లనూ డౌన్‌లోడ్ చేసుకొనేందుకు ఉంచారు. ఈ మార్కుల షీట్‌లు మార్చి 11 నుంచి ఏప్రిల్ 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మెయిన్ రాత పరీక్షలో క్వాలిఫై అయినవారితో పాటు క్వాలిఫై కాని వారి మార్కుల జాబితాలను సైతం వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థులు తమ రోల్ నంబర్/ఆర్‌ఐడీ/లాగిన్ నంబర్, పుట్టిన తేదీ/పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి తమ మార్కుల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సివిల్స్ మెయిన్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థుల మార్కుల షీట్లు
సివిల్స్ మెయిన్‌లో క్వాలిఫై కాని అభ్యర్థుల మార్కుల షీట్లు