AFCAT result 2026 | ఎఫ్‌ క్యాట్‌ ఫలితాలు విడుదల.. స్కోరు కార్డు కోసం క్లిక్‌ చేయండి

AFCAT result 2026 | ఎఫ్‌ క్యాట్‌ ఫలితాలు విడుదల.. స్కోరు కార్డు కోసం క్లిక్‌ చేయండి

భారత వైమానిక దళం(Indian Airforce)లోని పలు విభాగాల్లో 340 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్(AFCAT)ఫలితాలు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :11 Mar 2026 15:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  భారత వైమానిక దళం(Indian Airforce)లోని పలు విభాగాల్లో 340 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్(AFCAT 2026)ఫలితాలు విడుదలయ్యాయి. ఫ్లైయింగ్‌ బ్రాంచ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌టెక్నికల్‌) విభాగాల్లో గ్రూప్‌-ఎ గెజిటడ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి ఈ పరీక్ష జనవరి నెలాఖరులో నిర్వహించిన విషయం తెలిసిందే.  అభ్యర్థులు తమ ఫలితాలను ఏఎఫ్‌సీఏటీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి స్కోరు కార్డు పొందొచ్చని అధికారులు తెలిపారు.

స్కోరు కార్డు కోసం క్లిక్‌ చేయండి

ఎయిర్‌ఫోర్స్‌లోని ఫ్లైయింగ్‌ బ్రాంచ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌) బ్రాంచ్‌ల్లో పలు ఉద్యోగ నియామకాలకు గతేడాది నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 14వ తేదీ వరకు స్వీకరించిన విషయం తెలిసిందే.  ఎంపికైన వారికి 2027 జనవరి మొదటి వారంలో  ట్రైనింగ్‌ ప్రారంభం కానుంది. ఫ్లయింగ్‌ అండ్‌ గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌) విభాగాల వారికి 62 వారాలు.. గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌ టెక్నికల్‌) వారికి 50 వారాల పాటు శిక్షణ ఉంటుంది. వేతనం, ట్రైనింగ్‌, ఇతర పూర్తివివరాల కోసం క్లిక్‌ చేయండి.