GATE 2025 Key : గేట్‌ 2025 ప్రాథమిక కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

GATE 2025 Key : గేట్‌ 2025 ప్రాథమిక కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

గేట్‌ 2025 పరీక్ష ప్రాథమిక కీని ఐఐటీ రూర్కీ అధికారులు విడుదల చేశారు.

Eenadu icon
By Education News Team Published :27 Feb 2025 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష ప్రాథమిక కీ(GATE 2025 Key)విడుదలైంది. దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రాథమిక కీని ఐఐటీ రూర్కీ(IIT Roorkee) అధికారులు విడుదల చేశారు. 

ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి

ఈ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు తెలపవచ్చని అధికారులు సూచించారు.  ఇందుకోసం ఒక్కో ప్రశ్నకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 19న ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. విద్యార్థులు తమ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. స్కోర్‌ కార్డులను మార్చి 28 నుంచి మే 31వరకు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.