IIT Madras New course | జాబ్ చేస్తూ ఏఐ స్కిల్స్ పెంచుకొనేలా.. ఐఐటీ మద్రాస్ సరికొత్త కోర్సు!
ఉద్యోగం చేస్తుండగా తమ నైపుణ్యాలను పెంచుకోవాలనుకొనే వారికి ఐఐటీ మద్రాస్ (IIT Madras) గుడ్‌న్యూస్ చెప్పింది.
By Education News Team
Published :12 Feb 2024 22:53 IST
https://results.eenadu.net/news.aspx?newsid=12022025
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం చేస్తూనే తమ నైపుణ్యాలను పెంచుకోవాలనుకొనే వారికి ఐఐటీ మద్రాస్ (IIT Madras) గుడ్‌న్యూస్ చెప్పింది. మార్కెట్‌కు అనుగుణంగా వైవిధ్యమైన కోర్సులు అందించే ఈ ప్రఖ్యాత విద్యాసంస్థ.. ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వెబ్ ఎంటెక్(Web Mtech) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీంతో వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ జాబ్ కొనసాగిస్తూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగంలో సరికొత్త నైపుణ్యాలతో వినూత్న అవకాశాలను అందిపుచ్చుకొనే అవకాశం కలగనుంది. ఇందులో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ విభాగాల్లోనే కోర్సులు..
- ఏరో స్పేస్ ఇంజినీరింగ్ (ఏరో స్పేస్, అమ్యునిషన్ టెక్నాలజీ)
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్; కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, మల్టీ మీడియా, మైక్రో ఎలక్ట్రానిక్స్)
- మెకానికల్ ఇంజినీరింగ్ (మెకానికల్ డిజైన్, ఆటోమోటివ్ టెక్నాలజీ)
- ఈ-మొబిలిటీ
అర్హులు ఎవరంటే?
- తాము ఎంచుకోవాలనుకొనే స్పెషలైజేషన్ కోర్సులకు సంబంధించిన విద్యా నేపథ్యంతో పాటు కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
- సీట్ల భర్తీ కోసం సంబంధిత అంశాలను కవర్ చేసేలా క్వాలిఫయర్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులు తమ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే కొత్త అంశాలు నేర్చుకోవడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా మరింతగా రాణించొచ్చు.
- ప్రవేశ పరీక్ష సిలబస్, దరఖాస్తు రుసుం, ప్రోగ్రామ్ స్ట్రక్చర్, కోర్సు వ్యవధి, ఫీజు సహా సమగ్ర సమాచారాన్ని ఐఐటీ మద్రాస్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
ఐఐటీ మద్రాస్ గతంలో పరిశ్రమల అవసరాలకనుగుణంగా ఇండస్ట్రియల్ ఏఐలో వెబ్ ఎంటెక్ కోర్సును అందించింది. కానీ, ప్రస్తుత మార్కెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యత, ఆదరణ, అవసరాన్ని గుర్తించింది. అందుకనుగుణంగా మరింత సమగ్రంగా, విస్తృతంగా డిజైన్ చేసి సరికొత్తగా వెబ్ ఎంటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Web M.Tech in Artificial Intelligence) పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది.
- సాయంత్రం / వారాంతపు లైవ్ వర్చువల్ తరగతులకు హాజరు కావడం లేదా రికార్డ్ చేసిన సెషన్లను యాక్సిస్ చేసుకొనే సౌలభ్యం ద్వారా ఈ కోర్సు పూర్తి చేయొచ్చు.
- ఈ ప్రోగ్రామ్‌ను ఎంచుకున్న వారికి ల్యాబ్‌లు, ప్రాజెక్టుల ద్వారా విస్తృతమైన ఆచరణాత్మకమైన అనుభవం సొంతమవుతుంది. ఈ వెబ్ ఎంటెక్ ప్రోగ్రామ్ పూర్తి చేయడం ద్వారా ఐఐటీ మద్రాస్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందొచ్చు.
- ఐఐటీ మద్రాస్ అందిస్తోన్న 11 ప్రోగ్రామ్‌లకు ఇప్పటివరకు 1350మందికి పైగా ఎన్‌రోల్ చేసుకున్నారు. ప్రస్తుతం 850మందికి పైగా ఆయా కోర్సులను అభ్యసిస్తుండగా.. 350మందికి పైగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు, ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.