CUET (UG) 2025 Results | సీయూఈటీ (యూజీ) ఫలితాలొచ్చాయ్.. స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET- UG2025) ఫలితాలను ఎన్‌టీఏ(NTA) విడుదల చేసింది.
By Education News Team
Published :04 Jul 2025 14:52 IST
https://results.eenadu.net/news.aspx?newsid=04072025-cuet-2025-results
ఇంటర్నెట్ డెస్క్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET- UG2025) ఫలితాలను ఎన్‌టీఏ(NTA) విడుదల చేసింది. మే 13వ తేదీ నుంచి జూన్ 4 వరకు జరిగిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 13లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇటీవల ఫైనల్ కీ విడుదల చేసిన అధికారులు తాజాగా స్కోర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి తమ స్కోర్ కార్డును పొందొచ్చు.
స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
నాలుగు సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్‌తో విద్యార్థి సత్తా
ఐదు సబ్జెక్టులకు గాను నాలుగు సబ్జెక్టుల్లో ఓ విద్యార్థి 100 పర్సంటైల్ స్కోరు సాధించి సత్తా చాటారు. అలాగే, మరో 17 మంది విద్యార్థులు మూడు సబ్జెక్టుల్లో వంద పర్సంటైల్ సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
సీయూఈటీ (యూజీ) స్కోరుతో దేశ వ్యాప్తంగా 250కి పైగా కేంద్ర, రాష్ట్ర, పలు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. సీయూఈటీ-యూజీని కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.