IBPS PO Results | ఐబీపీఎస్‌ పీవో ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

IBPS PO Results | ఐబీపీఎస్‌ పీవో ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (IBPS) పీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Published : 26 Sep 2025 17:38 IST
ఇంటర్నెట్ డెస్క్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (IBPS) పీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆగస్టులో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. మొత్తంగా 5,208 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 1007 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి జులై 1 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌లను ఎంటర్‌ చేసి ఫలితాలు పొందొచ్చు. వెబ్‌సైట్‌లో ఈ ఫలితాలు నేటి నుంచి అక్టోబర్‌ 3వరకు అందుబాటులో ఉంటాయని ఐబీపీఎస్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రిలిమ్స్‌ పరీక్షల్లో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు అక్టోబర్‌లో జరగనున్న మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు.