GATE 2026 Admit Cards | గేట్ అడ్మిట్ కార్డులు విడుదల
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.
By Education News Team
Updated : 13 Jan 2026 18:34 IST
https://results.eenadu.net/news.aspx?newsid=GATE-2026-Admit-Cards-released
GATE 2026 Admit Cards | ఇంటర్నెట్ డెస్క్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. GATE 2026 Admit cardsని ఐఐటీ గువాహటి ( IIT Guwahati) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి తమ అడ్మిట్ కార్డుల్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గేట్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గేట్ పరీక్ష ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మరోవైపు, గేట్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టెస్ట్‌పేపర్లు/ సిలబస్‌తో పాటు మాక్ టెస్టులు, గత 18 ఏళ్లకు సంబంధించిన పాత క్వశ్చన్ పేపర్లనూ వెబ్‌సైట్‌లో పొందొచ్చు.