SBI Clerk Main Results | ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్‌ ఫలితాలు విడుదల.. ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదిగో!

SBI Clerk Main Results | ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్‌ ఫలితాలు విడుదల.. ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదిగో!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ(SBI)లో క్లర్క్ (జూనియర్‌ అసోసియేట్‌) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు(SBI clerk Mains Results 2025) విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :27 Feb 2026 18:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ(SBI)లో క్లర్క్‌ (జూనియర్‌ అసోసియేట్‌) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్‌ పరీక్ష ఫలితాలు (SBI clerk Mains Results 2025) విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌ 21న నిర్వహించిన మెయిన్‌ పరీక్ష ఫలితాలను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో ప్రతిభకనబరిచి ఈ పోస్టులకు ప్రొవిజినల్‌గా ఎంపికైన వారి రోల్‌ నంబర్లతో రూపొందించిన జాబితాను ఎస్‌బీఐ అధికారులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మెయిన్‌ ఫలితాల్లో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు తదుపరి దశలో లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ)కి హాజరు కావాల్సి ఉంటుంది.

ప్రొవిజినల్‌గా ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే.. 

దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో దాదాపు 6వేలకు పైగా జూనియర్‌ అసోసియేట్స్‌ (కస్టమర్‌ సపోర్టు అండ్‌ సేల్స్‌) పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్‌ విడుదల చేసి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్‌లో ప్రిలిమ్స్‌, నవంబర్‌లో మెయిన్‌ పరీక్షలు నిర్వహించిన అధికారులు.. ఈ పోస్టులకు ప్రొవిజినల్‌గా ఎంపికైన అభ్యర్థుల జాబితాను తాజాగా ప్రకటించారు. ఈ ప్రొవిజినల్‌ జాబితాలో ఎంపికైన అభ్యర్థులంతా సంబంధిత రాష్ట్రాల ఎస్‌బీఐ లోకల్‌ హెడ్‌ ఆఫీస్‌ల నుంచి తదుపరి సూచనల కోసం వేచి ఉండాలని, పరీక్షకు సంబంధించి ఏవైనా అప్‌డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవాలని సూచించారు.