UPSC IFS Main 2025 Results| ఇండియన్ ఫారెస్ట్‌ సర్వీస్‌ (మెయిన్‌) ఫలితాలు విడుదల

UPSC IFS Main 2025 Results| ఇండియన్ ఫారెస్ట్‌ సర్వీస్‌ (మెయిన్‌) ఫలితాలు విడుదల

ఇండియన్ ఫారెస్ట్‌ సర్వీస్‌ (మెయిన్) 2025 ఫలితాలు (UPSC IFS 2025 main Results) విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :25 Feb 2026 15:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ఫారెస్ట్‌ సర్వీస్‌ (మెయిన్) 2025 ఫలితాలు (UPSC IFS Main 2025 Results) విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌ 16 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగ్గా.. పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)లకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను యూపీఎస్సీ(UPSC) ప్రకటించింది. గతేడాది మే నెలలో సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మెయిన్‌ ఫలితాలను విడుదల చేసిన అధికారులు.. ఇందులో సత్తా చాటిన వారికి ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా

ఇంటర్వ్యూ షెడ్యూల్‌తో పాటు ఈ-సమన్‌ లెటర్‌ను సైతం త్వరలోనే తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. ఈ-సమన్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కమిషన్‌ ఆఫీస్‌ను లెటర్‌/ఈ-మెయిల్‌ soexam9-upsc@gov.in ద్వారా గానీ, ఫోన్‌ నంబర్లు 011-23385271, 011-23381125, Fax No. 011-23387310, 011-23384472లలో గానీ సంప్రదించవచ్చని సూచించింది. ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.