AISSEE 2026 Results| సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష 2026 ఫలితాలు విడుదల

AISSEE 2026 Results| సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష 2026 ఫలితాలు విడుదల

ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష (AISSEE 2026) ఫలితాలు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :27 Feb 2026 21:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష (AISSEE 2026) ఫలితాలు విడుదలయ్యాయి. 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించి ఇటీవల ప్రొవిజినల్‌ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ(NTA) అధికారులు.. తాజాగా తుది కీ, ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి స్కోరు కార్డుని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే, ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రూపొందించిన ర్యాంకుల జాబితాలను సైతం వేర్వేరుగా విడుదల చేశారు. 

స్కోరు కార్డు కోసం క్లిక్‌ చేయండి

సైనిక్‌ స్కూల్స్‌/న్యూ సైనిక్‌ స్కూల్స్‌లో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం జనవరి 18న దేశవ్యాప్తంగా 190 సిటీల్లోని 464 పరీక్షా కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు సైనిక్‌ స్కూల్స్‌ సొసైటీ ఈ-కౌన్సెలింగ్‌ విధానంలో ప్రవేశాలు కల్పిస్తుంది. అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఈమెయిల్‌ ఐడీ admission.sss@gov.inకు పంపవచ్చని అధికారులు సూచించారు.

ఆరో తరగతి ప్రవేశ పరీక్ష.. ర్యాంకుల జాబితా 

తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష.. ర్యాంకుల జాబితా