UPSC ESE 2026 Results| ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్
దేశ వ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష ఫలితాలు ( Engineering Services -Preliminary Examination Results)విడుదలయ్యాయి.
By Education News Team
Updated :26 Feb 2026 22:31 IST
https://results.eenadu.net/education-news/UPSC-Engineering-Services-Preliminary-Exam-results-out
ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష ఫలితాలు ( Engineering Services -Preliminary Examination Results)విడుదలయ్యాయి. ఫిబ్రవరి 8న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ(UPSC) గురువారం ప్రకటించింది. మెయిన్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్లు, పేర్లతో వేర్వేరుగా రూపొందించిన జాబితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇంజినీరింగ్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష జూన్ 21న నిర్వహించనున్నట్లు తెలిపింది.
రోల్ నంబర్ల వారీగా జాబితా కోసం క్లిక్ చేయండి
ఈ పరీక్షకు దాదాపు వారం రోజుల ముందు ఈ-అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ కోసం ఉంచనున్నట్లు తెలిపింది. తుది పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాతే ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాఫ్ మార్కుల వివరాలను తెలపనున్నట్లు పేర్కొంది. యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన అభ్యర్థులను కేంద్ర ప్రభుత్వంలోని రైల్వేలు, రక్షణ, టెలికాం, పవర్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్‌లలో గెజిటెడ్ అధికారులుగా నియమిస్తుంటారు.
మెయిన్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల పేర్లతో జాబితా
ఈఎస్ఈ పరీక్షకు సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే.. అభ్యర్థులు యూపీఎస్సీ ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కౌంటర్‌కు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు (పని దినాల్లో) సంప్రదించవచ్చని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, 011 -23388088/23385271/23381125/23098543 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. తుది పరీక్ష ముగిసిన అనంతరం ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులు, మార్కులను వెల్లడిస్తారు.