JEE Main 2026 | జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల.. స్కోరు కార్డు కోసం క్లిక్ చేయండి
జేఈఈ మెయిన్ పేపర్-2 తొలి విడత ఫలితాలు (JEE Main paper 2 Session 1 Results) విడుదలయ్యాయి.
By Education News Team
Updated :24 Feb 2026 18:37 IST
https://results.eenadu.net/education-news/Jee-main-paper-2-exam-results-out
JEE Main Results| ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ పేపర్-2 తొలి విడత ఫలితాలు (JEE Main paper 2 Session 1 Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఇద్దరే 100 పర్సంటైల్ స్కోరు సాధించగా.. వారిద్దరూ కేరళకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీఆర్క్ సీట్లకు పేపర్-2ఏ, బీ ప్లానింగ్ సీట్లకు పేపర్ 2బీ పరీక్షలను జనవరి 29న ఎన్‌టీఏ (NTA) నిర్వహించిన విషయం తెలిసిందే. పేపర్-2ఏకు 64,786 మంది దరఖాస్తు చేసుకోగా.. 45,452 మంది పరీక్ష రాశారు. అలాగే, పేపర్-2బీకి 32,366 మందికి గాను 21,067 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 19న ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేసిన అధికారులు.. నిన్న తుది కీ విడుదల చేసి తాజాగా ఫలితాలను ప్రకటించారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్కోరు కార్డు కోసం క్లిక్ చేయండి
తెలుగు రాష్ట్రాల నుంచి మెరిసింది వీరే..
పేపర్ 2ఏలో తెలంగాణకు చెందిన తేల్లూరి శ్రేయస్ రెడ్డి 99.99 పర్సంటైల్‌తో అదరగొట్టగా.. ఏపీ నుంచి ఓరుగంటి శరణ్య అశ్విని 99.95 స్కోరుతో మెరిశారు. పేపర్ 2బీలో తెలంగాణ నుంచి మద్దూరి నాగ ప్రద్యుమ్న రెడ్డి 99.98 స్కోరు సాధించగా.. ఏపీ నుంచి పైలా హర్షాదిత్య, వానపల్లి శ్రీ ఈశ్వర్ రాజ్, సింగంశెట్టి వెంకట భీమ తులిప్ 99.95 పర్సంటైల్ స్కోరుతో సత్తా చాటారు. టాపర్ల జాబితా కోసం క్లిక్ చేయండి.
మలి విడతకు రేపే ఆఖరు
మరోవైపు, జేఈఈ మెయిన్ మలి విడత పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఫిబ్రవరి 25తో ముగియనుంది. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాయొచ్చు. ఈ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే.