AISSEE 2026 Admit Cards| సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా!

AISSEE 2026 Admit Cards| సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా!

ఈ నెల 18న జరగనున్న ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష (AISSEE 2026)కు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :12 Jan 2026 16:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ నెల 18న జరగనున్న ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష (AISSEE 2026)కు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. ఇటీవల  అడ్వాన్స్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేసిన ఎన్‌టీఏ (NTA).. సోమవారం సాయంత్రం అడ్మిట్‌ కార్డుల్ని (AISSEE 2026 Admit Cards) డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డుని పొందొచ్చు. 

అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి

దేశ వ్యాప్తంగా 464 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అడ్మిట్‌ కార్డుల్ని విడుదల చేసిన అధికారులు.. డౌన్‌లోడ్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే 011-40759000, 011-69227700 నంబర్లను లేదా aissee@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించారు. ఈ ఎగ్జామ్‌ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలను కల్పించనున్న విషయం తెలిసిందే.