Mathematical Skills| ఏఐతో మ్యాథ్స్‌ స్కిల్స్‌ని పెంచుకోవడం ఎలా? ఎన్‌సీఈఆర్‌టీ ఆన్‌లైన్ శిక్షణ

Mathematical Skills| ఏఐతో మ్యాథ్స్‌ స్కిల్స్‌ని పెంచుకోవడం ఎలా? ఎన్‌సీఈఆర్‌టీ ఆన్‌లైన్ శిక్షణ

విద్యార్థుల్లో గణిత నైపుణ్యాల్ని మెరుగుపరిచేందుకు ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది.

Eenadu icon
By Education News Team Updated :11 Jan 2026 15:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విద్యార్థుల్లో గణిత నైపుణ్యాల్ని మెరుగుపరిచేందుకు ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది.  కృత్రిమ మేధ (AI) ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవచ్చనే అంశంపై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం నాలుగు రోజుల పాటు ఆన్‌లైన్‌ ఇంటరాక్షన్‌ ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేసింది. జనవరి 12 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ఈ ఇంటరాక్షన్‌ ఉంటుందని NCERT పేర్కొంది.

ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ https://www.youtube.com/@NCERTOFFICIAL/streams ద్వారా లేదా పీఎంఈ విద్య ద్వారా పాల్గొనవచ్చు.  డిజిటల్  టూల్స్‌, ఏఐ వంటివి వాటి ద్వారా గణిత అభ్యాసాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో తెలుసుకొనేందుకు ఇందులో పాల్గొనాలని ఎన్‌సీఈఆర్‌టీ విజ్ఞప్తి చేసింది. ఏవైనా సందేహాలు ఉంటే diksha.training@ciet.nic.in, 8800440559ను సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్‌ కోసం క్లిక్ చేయండి