AP TET Results | ఏపీ టెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. మార్కుల మెమో కోసం క్లిక్‌ చేయండి

AP TET Results | ఏపీ టెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. మార్కుల మెమో కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2025) ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది డిసెంబర్‌ 10 నుంచి 21 వరకు జరిగిన ఈ పరీక్షకు 2,71,692 దరఖాస్తులు రాగా.. 2,48,427 మంది హాజరైనట్లు ఏపీ టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.

Eenadu icon
By Education News Team Updated :09 Jan 2026 17:59 IST IST

AP TET Results| ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2025) ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది డిసెంబర్‌ 10 నుంచి 21 వరకు జరిగిన ఈ పరీక్షకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,48,427 మంది హాజరైనట్లు ఏపీ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి తొలుత ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు.. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది కీ, ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి టెట్‌ మార్కుల మెమో (AP TET Marks Memo) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

టెట్‌ మార్క్‌ల మెమో కోసం క్లిక్‌ చేయండి

టెట్‌లో 97,560 మంది (39.27 శాతం) ఉత్తీర్ణులైనట్లు కన్వీనర్‌ వెల్లడించారు. ఈ పరీక్షకు 31,886 మంది ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు హాజరు కాగా.. వారిలో 47.82 శాతం(15,239) మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. టెట్‌ పరీక్ష ఫలితాలను https://tet2dsc.apcfss.in, 9552300009 వాట్సప్‌ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని టెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు.