UGC NET (June) Certificates | యూజీసీ- నెట్‌ (జూన్‌) సర్టిఫికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

UGC NET (June) Certificates | యూజీసీ- నెట్‌ (జూన్‌) సర్టిఫికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

యూజీసీ నెట్‌ (జూన్‌) పరీక్ష ఫలితాలను అక్టోబర్‌లో వెల్లడించిన ఎన్‌టీఏ.. తాజాగా సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచింది.

Eenadu icon
By Education News Team Published :26 Dec 2024 18:13 IST

UGC NET Certificates | ఇంటర్నెట్‌ డెస్క్‌:  యూజీసీ నెట్‌ (జూన్‌) 2024 రాసిన అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌. అక్టోబర్‌లో ఈ పరీక్ష ఫలితాలు వెల్లడించిన ఎన్‌టీఏ.. తాజాగా UGC-NET (June) సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ కోడ్‌ ఎంటర్‌ చేసి సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ను తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. సర్టిఫికెట్‌పై ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ లేకపోతే చెల్లవని, అందువల్ల రీ-డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపింది. సర్టిఫికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే.. ugcnet@nta.ac.in లేదా ecertificate@nta.ac.inకు ఈమెయిల్‌ చేయాలని ఎన్‌టీఏ డైరెక్టర్‌ (పరీక్షలు) రాజేశ్ కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

యూజీసీ నెట్‌ (జూన్‌) సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌

మొత్తం 83 సబ్జెక్టులకు గాను ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 4వరకు యూజీసీ నెట్‌ (జూన్‌) పరీక్షలు జరగ్గా.. అక్టోబర్‌ 17న ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 11,21,225మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 6.84లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 4970మంది జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించగా.. 53,694మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు, 1,12,070మంది పీహెచ్‌డీకి మాత్రమే క్వాలిఫై అయ్యారు. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం ఏటా రెండు సార్లు (జూన్‌, డిసెంబర్‌) యూజీసీ నెట్‌ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. యూజీసీ నెట్‌ (డిసెంబర్‌) సెషన్‌ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్‌ సెషన్‌ ugc net పరీక్ష జనవరి 3 నుంచి 16వరకు జరగనుంది.