UPSC Civils toppers Marks| సివిల్స్‌-2 024 టాపర్లు స్కోర్‌ చేసిన మార్కులెన్నో తెలుసా?

UPSC Civils toppers Marks| సివిల్స్‌-2 024 టాపర్లు స్కోర్‌ చేసిన మార్కులెన్నో తెలుసా?

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష‌-2024 ఫలితాల్లో (UPSC Civils 2024 Result) అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు వెల్లడయ్యాయి.

Eenadu icon
By Education News Team Published : 25 Apr 2025 20:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష(UPSC CSE 2025).. లక్షలాది మంది అభ్యర్థలకు ఇదో స్వప్నం. దీన్ని సాకారం చేసుకోవడం అంత ఆషామాషీ కాదు. లక్షల మంది  ప్రిలిమ్స్‌ రాస్తే.. చివరకు ఎంపికయ్యేది వందల్లోనే. సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావాలంటే ఎంతో కృషి, పట్టుదలతో పాటు కఠోర శ్రమ, కచ్చితమైన ప్రణాళిక కావాలి. ఇటీవల విడుదలైన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష‌-2024 ఫలితాల్లో (UPSC Civils 2024 Result) అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు వెల్లడయ్యాయి. సివిల్స్‌లో టాపర్లుగా నిలిచిన తొలి పది మంది, 100లోపు ర్యాంకులు సాధించిన పలువురు తెలుగు విద్యార్థుల మార్కులు ఇలా ఉన్నాయి.

తొలి 10 మంది టాపర్ల స్కోరు ఇదే..

సివిల్స్‌ మెయిన్‌, ఇంటర్వ్యూలకు కలిపి మొత్తంగా 2025 మార్కులు ఉంటాయి. దీంట్లో మెయిన్‌/రాతపరీక్షకు 1750 మార్కులు, ఇంటర్వ్యూకి 275 మార్కులు చొప్పున కేటాయిస్తారు. అయితే, 2024 సివిల్స్‌ పరీక్షలో తొలి ర్యాంకు సాధించిన శక్తి దూబే 1043 మార్కులు (రాత పరీక్షలో 843 మార్కులు, ఇంటర్వ్యూలో 200 మార్కులు) సాధించినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అలాగే, రెండో ర్యాంకర్‌ హర్షిత గోయల్‌ 1038 మార్కులు (రాతపరీక్షలో 851, ఇంటర్వ్యూ 187 మార్కులు), మూడో ర్యాంకుతో మెరిసిన డోంగ్రే అర్చిత్‌ పరాగ్‌ సైతం 1038 మార్కులు (రాతపరీక్ష 848, ఇంటర్వ్యూ 190), నాలుగో ర్యాంకర్‌ షా మార్గి చిరాగ్‌ 1035 (825, 210 మార్కులు), ఐదో ర్యాంకర్‌ ఆకాశ్‌ గార్గ్‌ 1032 (831, 201);  కోమల్‌ పునియా 1032 (856, 176), ఆయుషీ బన్సల్‌ 1031 (821, 210), రాజ్‌కృష్ణ ఝా 1031 ( 831, 200),  ఆదిత్య విక్రమ్‌ అగర్వాల్‌ 1027 (854, 173), మయాంక్‌ త్రిపాఠి 1027 (843, 184) మార్కులు చొప్పున సాధించినట్లు యూపీఎస్సీ తెలిపింది.

సివిల్స్‌-2024 విజేతల మార్కుల కోసం క్లిక్‌ చేయండి

మరోవైపు, సివిల్స్‌లో 11వ ర్యాంకుతో సత్తా చాటిన ఇట్టబోయిన సాయి శివానీకి 1027 (రాత పరీక్షలో 825, ఇంటర్వ్యూలో 201) మార్కులు వచ్చాయి.  అలాగే, 15వ ర్యాంకుతో మెరిసిన బన్నా వెంకటేశ్‌కు 1023 (838, 185), రావుల జయసింహారెడ్డి 1000 (805, 195), చింతకింది శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి 995 (813, 182), సాయి చైతన్య జాదవ్‌ 992 (787, 205), చక్కా స్నేహిత్‌ 986 (808, 178) మార్కులు సాధించారు.