Navodaya 2025 Applications | ‘నవోదయ’లో 6వ తరగతి ప్రవేశాలు.. దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
        
        దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 7వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
     
    
    
        Published :24 Sep 2024 20:35 IST
        
            
            
            
                
                
                
                    https://results.eenadu.net/news.aspx?newsid=24092024
                    
                 
             
            
            
            
         
        
     
    
    Navodaya 2025| దిల్లీ: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు అక్టోబర్ 7వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నవోదయ విద్యాలయ సమితి తెలిపింది. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో సెప్టెంబర్ 16వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపిన అధికారులు.. ఆ తర్వాత వారం రోజుల పాటు పొడిగించారు. ఆ సమయం సైతం సెప్టెంబర్ 23తో ముగియడంతో మరోసారి దరఖాస్తుల గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ గోల్డెన్ ఛాన్స్.. ₹500కే ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు!
	- అర్హతలు: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
- వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2013 నుంచి జులై 31, 2015 మధ్య జన్మించిన వారై ఉండాలి.
- ప్రవేశ పరీక్ష: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు(మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో నవోదయ అధికారిక వెబ్‌సైట్ https://cbseitms.rcil.gov.in/nvs/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు/ నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.
- ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. రెండు విడతల్లో నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది మార్చి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది.