UGC NET 2025 Admit Cards| యూజీసీ నెట్‌ అడ్మిట్ కార్డులు విడుదల

UGC NET 2025 Admit Cards| యూజీసీ నెట్‌ అడ్మిట్ కార్డులు విడుదల

యూజీసీ నెట్‌ (డిసెంబర్‌ 2025) పరీక్షకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Published :28 Dec 2025 14:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యూజీసీ నెట్‌ (డిసెంబర్‌ 2025) పరీక్షకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.  డిసెంబర్‌ 31, జనవరి 2, 3,5,6,7 తేదీల్లో జరిగే ఈ పరీక్ష(UGC NET 2025)కు సంబంధించి ఇటీవల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసిన ఎన్‌టీఏ (NTA).. తాజాగా డిసెంబర్‌ 31న జరిగే పరీక్షకు అడ్మిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మిగతా తేదీల్లో పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌ కార్డులను తర్వాత విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్ కార్డును పొందొచ్చు.

అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి

ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (CBT)  రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు; మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో షిఫ్టు పరీక్ష ఉంటుంది. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు యూజీసీ నెట్‌ పరీక్ష ఉపయోగపడనుంది. అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే ఎన్‌టీఏ హెల్ప్‌డెస్క్‌  011-40759000 నంబర్‌కు లేదా ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.