JEE Main 2026| జేఈఈ మెయిన్‌ ఉచిత మాక్‌ టెస్టులివిగో.. మీ స్కోరుపై AI విశ్లేషణ!

JEE Main 2026| జేఈఈ మెయిన్‌ ఉచిత మాక్‌ టెస్టులివిగో.. మీ స్కోరుపై AI విశ్లేషణ!

జేఈఈ మెయిన్ పరీక్షలకు (JEE Main 2026)ఇంకా కొద్ది రోజులే గడువు ఉంది. ఎంతో కఠినంతో కూడిన ఈ జాతీయ స్థాయి పరీక్షకు పక్కా ప్రణాళిక, తగినంత ప్రాక్టీస్‌ అవసరం.

Eenadu icon
By Education News Team Updated :21 Dec 2025 18:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జేఈఈ మెయిన్ పరీక్షలకు (JEE Main 2026)ఇంకా కొద్ది రోజులే గడువు ఉంది. ఎంతో కఠినమైన ఈ జాతీయ స్థాయి పరీక్షకు పక్కా ప్రణాళిక, తగినంత ప్రాక్టీస్‌ అవసరం. ఈ నేపథ్యంలో నిష్ణాతులైన ఐఐటియన్లతో రూపొందించిన, ఏఐ ఆధారిత విశ్లేషణతో కూడిన టెస్ట్‌ సిరీస్‌లను సాథీ పోర్టల్‌ వేదికగా అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. పూర్తిగా ఉచితంగా లభించే ఈ మాక్‌ టెస్టులను ప్రయత్నించి మీ స్కోరు పొందడంలో సరికొత్త అనుభూతిని పొందొచ్చు. 

మాక్‌ టెస్టుల కోసం క్లిక్‌ చేయండి

సాథీ జేఈఈ ఆలిండియా టెస్ట్‌ సిరీస్‌ ఏఐ ఆధారితంగా మీ పనితీరును విశ్లేషిస్తుంది. పరీక్ష అనంతరం సందేహాల నివృత్తి సెషన్‌లను సైతం అందిస్తుంది.  తొలుత ఈ పోర్టల్‌లో రిజిస్టర్‌ అయిన తర్వాత విద్యార్థులు పూర్తి టెస్టు షెడ్యూల్‌ని పొందొచ్చు. విద్యార్థులకు అత్యంత ప్రామాణికమైన పరీక్ష అనుభవాన్ని అందించేలా దీన్ని డిజైన్‌ చేశారు. పరీక్ష రాసిన తర్వాత విద్యార్థులకు ఏఐ సిస్టమ్‌ ఒక సమగ్రమైన రిపోర్టు కార్డును అందిస్తుంది. ఇది కేవలం మార్కులు, ర్యాంకును చూపించడమే కాకుండా విద్యార్థి వెనకబడి ఉన్న చాప్టర్లు ఏంటీ? ఏ రకమైన ప్రశ్నలు తప్పుగా రాశారు?  టైం మేనేజ్‌మెంట్‌, టాపర్లతో పోలిస్తే పెర్ఫామెన్స్‌ ఎలా ఉంది? తదితర వివరాలను చూపిస్తుంది.

ఈ మాక్‌ టెస్టులను రాయడం ద్వారా విద్యార్థులకు పరీక్షకు సంబంధించి రియల్‌ టైం అనుభవంతో పాటు పరీక్షలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. రాసిన ప్రతి మాక్‌టెస్టునీ లోతుగా విశ్లేషించుకోవడం ద్వారా చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు ఇదో సువర్ణావకాశం. ఎక్కడ వెనకబడి ఉన్నారో, సమయం ఎక్కడ వృథా అవుతుందో గుర్తించి తదనుగుణంగా మీ స్ట్రైక్‌ రేట్‌ని మెరుగుపరుచుకొనేలా  తదుపరి ప్రిపరేషన్‌ను ప్లాన్‌ చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.