UPSC ESE Result | యూపీఎస్సీ ESE ఫలితాల్లో మెరిసిన పాలకొల్లు యువతి
యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాల్లో (UPSC ESE Results) పాలకొల్లుకు చెందిన ఓ యువతి సత్తా చాటారు.
By Education News Team
Updated :18 Dec 2025 21:53 IST
https://results.eenadu.net/news.aspx?newsid=18122025upscese
పాలకొల్లు మార్కెట్: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాల్లో (UPSC ESE Results) పాలకొల్లుకు చెందిన యువతి సత్తా చాటారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని లంకలకోడేరు గ్రామానికి చెందిన గోపిశెట్టి కవితా బేబీ ఆలిండియా స్థాయిలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్ ఇంజినీరింగ్ విభాగంలో48వ ర్యాంకుతో మెరిశారు. గోపిశెట్టి సత్యనారాయణ, హైమావతి దంపతుల కుమార్తె అయిన కవిత.. ఎన్‌ఐటీ సూరత్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. యూపీఎస్సీ ఈఎస్‌ఈ ఫలితాల్లో 48వ ర్యాంకులో మెరిసిన యువతికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, బంధుమిత్రులు అభినందనలు తెలుపుతూ.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
దేశ వ్యాప్తంగా ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి ఆగస్టులో యూపీఎస్సీ ఈఎస్‌ఈ రాత పరీక్ష నిర్వహించిన అధికారులు.. అక్టోబర్ , నవంబర్ మధ్య కాలంలో పర్సనాలిటీ టెస్టు పూర్తి చేసి తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎంపికైన వారి మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి