UGC NET 2025 | సబ్జెక్టుల వారీగా యూజీసీ-నెట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

UGC NET 2025 | సబ్జెక్టుల వారీగా యూజీసీ-నెట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

డిసెంబర్‌ 31 నుంచి జనవరి 7 వరకు యూజీసీ నెట్‌ (UGC NET 2025) నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఎన్టీఏ.. తాజాగా సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Eenadu icon
By Education News Team Updated : 18 Dec 2025 14:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యూజీసీ నెట్‌ (డిసెంబర్‌ 2025) పరీక్షకు సమయం సమీపిస్తోంది. డిసెంబర్‌ 31 నుంచి జనవరి 7 వరకు ఈ పరీక్ష (UGC NET 2025) నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఎన్టీఏ(NTA).. తాజాగా సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (CBT)  రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు; మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో షిఫ్టు పరీక్ష ఉంటుంది. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడనుంది.

సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ కోసం క్లిక్‌చేయండి

పరీక్షకు పది రోజుల ముందు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు అప్‌డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు తమ అధికారిక వెబ్‌సైట్‌ https://ugcnet.nta.nic.inను సందర్శించి చెక్‌ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే 011 - 40759000 నంబర్‌ లేదా ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.