Nursing Officer Merit List | తెలంగాణ నర్సింగ్‌ ఆఫీసర్‌ ఫలితాలు.. తొలి ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

Nursing Officer Merit List | తెలంగాణ నర్సింగ్‌ ఆఫీసర్‌ ఫలితాలు.. తొలి ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

తెలంగాణ నర్సింగ్‌ ఆఫీసర్‌ పరీక్ష ఫలితాలు (Telangana Nursing Officer) విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :24 Dec 2025 15:22 IST

హైదరాబాద్‌: తెలంగాణ నర్సింగ్‌ ఆఫీసర్‌ పరీక్ష (Telangana Nursing Officer)ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించి తొలి ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితాను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేశారు. మొత్తంగా 2,322 ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ విడుదల కాగా.. తెలంగాణ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు (MHSRB) గతేడాది నవంబర్‌ 23న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు హాజరైన 40,423 మంది అభ్యర్థులు సాధించిన మార్కులు, ఇతర వివరాలను బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

తొలి మెరిట్‌ జాబితా కోసం క్లిక్‌ చేయండి

ప్రొవిజినల్‌ మెరిట్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్‌ 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు బోర్డు వెబ్‌సైట్‌లో తెలపవచ్చని బోర్డు అధికారులు సూచించారు. అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం MHSRB రెండో తాత్కాలిక మెరిట్‌ జాబితాను త్వరలోనే విడుదల చేసి.. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను 1:1.5 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఎంపిక జాబితాను విడుదల చేసి.. వారంతా జనవరి నాటికి ఉద్యోగాల్లో చేరేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.