JEE Main Paper 2 Result 2025 | జేఈఈ (మెయిన్) పేపర్ 2 ఫలితాలు.. స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
జేఈఈ (మెయిన్) రెండో సెషన్ పేపర్ -2 పరీక్ష ఫలితాలు(JEE Main Paper 2 Result 2025) విడుదలయ్యాయి.
By Education News Team
Published :23 May 2025 16:55 IST
https://results.eenadu.net/news.aspx?newsid=23052025-jee-main-paper-2-result
JEE Main Paper 2 Results | ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ (మెయిన్) రెండో సెషన్ పేపర్ -2 పరీక్ష ఫలితాలు(JEE Main Paper 2 Result 2025) విడుదలయ్యాయి. బీఆర్క్/ బిప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 9వ తేదీన ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా తుది కీ, ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
ఏప్రిల్ 9న జరిగిన ఈ పరీక్షలో బీఆర్క్‌కు 63,378 మంది, బీ ప్లానింగ్‌కు 26,590మంది చొప్పున విద్యార్థులు హాజరయ్యారు. బీఆర్క్‌లో కర్ణాటకకు చెందిన అల్పేశ్ ప్రజాపతి, మహారాష్ట్రకు చెందిన నీల్ సందేశ్ అనే విద్యార్థులు 100 పర్సంటైల్‌తో సత్తా చాటగా.. బీ- ప్లానింగ్‌లో తమిళనాడుకు చెందిన గౌతమ్ కన్నాపిరన్, తరుణ్ రావత్ (ఉత్తరాఖండ్), సునిధి సింగ్ (మధ్యప్రదేశ్) 100 పర్సంటైల్‌తో మెరిశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కోటిపల్లి యశ్వంత్ సాత్విక్, గోవిందు ఆరుష్, కాసుకుర్తి లోక కృతి 99కి పైగా పర్సంటైల్ సాధించి సత్తా చాటారు.
తుది కీ కోసం క్లిక్ చేయండి