UPSC Annual calendar 2026 | యూపీఎస్సీ - 2026 జాబ్‌ క్యాలెండర్‌ విడుదల.. ‘సివిల్స్‌’ పరీక్షలు ఎప్పుడంటే?

UPSC Annual calendar 2026 | యూపీఎస్సీ - 2026 జాబ్‌ క్యాలెండర్‌ విడుదల.. ‘సివిల్స్‌’ పరీక్షలు ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వచ్చే ఏడాదిలో నిర్వహించే పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది.

Eenadu icon
By Education News Team Published : 16 May 2025 14:33 IST

UPSC 2026 Calendar| ఇంటర్నెట్ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వచ్చే ఏడాదిలో నిర్వహించే పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. 2026లో చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షల తేదీలతో ప్రత్యేక క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీంట్లో 2026 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను పేర్కొంది. దీనిప్రకారం.. యూపీఎస్సీ సివిల్స్‌, ఇండియన్ ఫారెస్ట్‌ సర్వీస్‌ పరీక్ష 2026 మే 24న జరగనుంది. ఇందుకోసం జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  అలాగే, యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్ష ఆగస్టు 21 నుంచి ఐదు రోజుల పాటు, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్ష నవంబర్‌ 22న జరగనుంది. (Educational News)

వీటితో పాటు కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ (ప్రిలిమినరీ) పరీక్ష, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ)పరీక్ష, సీబీఐ (డీఎస్పీ),  సీఐఎస్‌ఎఫ్‌, ఎన్‌డీఏ, సీడీఎస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ తదితర ఉద్యోగ నియామక పరీక్షల షెడ్యూల్‌ను యూపీఎస్సీ ఈ చార్ట్‌లో పేర్కొంది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చని పేర్కొంది.  యూపీఎస్సీ-2026 పరీక్షల క్యాలెండర్‌ను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడొచ్చు.

యూపీఎస్సీ క్యాలెండర్‌ 2026 కోసం క్లిక్‌ చేయండి