JEE Main Paper 2 Result 2025 | జేఈఈ (మెయిన్) పేపర్ 2 ఫలితాలు విడుదల
జేఈఈ (మెయిన్) పేపర్ 2 ఫలితాలు విడుదలయ్యాయి.
By Education News Team
Published :23 Feb 2025 17:09 IST
https://results.eenadu.net/news.aspx?newsid=230225
JEE Main Paper 2 Results | ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ (మెయిన్) పేపర్ -2 పరీక్ష ఫలితాలు(JEE Main Paper 2 Result 2025) విడుదలయ్యాయి. బీఆర్క్/ బిప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 30వ తేదీన ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు 22వ తేదీన తుది కీ విడుదల చేసి.. తాజాగా ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్కోరు కార్డు కోసం క్లిక్ చేయండి
జనవరి 30న జరిగిన ఈ పరీక్షలో బీఆర్క్‌కు 44,144 మంది, బీ ప్లానింగ్‌కు 18, 596 మంది విద్యార్థుల చొప్పున హాజరయ్యారు. బీఆర్క్‌లో మహారాష్ట్రకు చెందిన నీల్ సందేశ్ అనే విద్యార్థి 100 పర్సంటైల్‌తో సత్తా చాటగా.. బీ- ప్లానింగ్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన సునిధి సింగ్ 100 పర్సంటైల్ సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి యశ్వంత్ సాయి, సాకేత్ వేంపల్లి, అభయ్ కౌటిల్య, కళా సాయి సృజన, కె. ప్రణీత్, కె. లోక కృతి, ఐ. శ్రీసాయి ఇమ్నిష్ 99కి పైగా పర్సంటైల్ సాధించడం విశేషం.
రాష్ట్రాల వారీగా టాపర్ల జాబితా
మరోవైపు, జేఈఈ (మెయిన్) సెషన్ 2కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి సెషన్‌లో సాధించిన పర్సంటైల్‌తో సంతృప్తి చెందని విద్యార్థులు మరింత మెరుగైన స్కోరు కోసం ఫిబ్రవరి 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 8 మధ్య తేదీల్లో నిర్వహించనున్నారు.
పేపర్ 2 ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి