UGC NET Results out | యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి

UGC NET Results out | యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి

యూజీసీ నెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.

Eenadu icon
By Education News Team Published :23 Feb 2025 09:53 IST

UGC-NET Results | ఇంటర్నెట్ డెస్క్‌: యూజీసీ -నెట్‌  డిసెంబర్‌ 2024 ఫలితాలు(UGC-NET Results) విడుదలయ్యాయి. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత కోసం ఈ పరీక్షను జనవరి 3, 6, 7, 8, 9, 10, 16, 21, 27 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసి ఫిబ్రవరి 3వరకు అభ్యంతరాలు స్వీకరించిన ఎన్‌టీఏ(NTA).. తాజాగా ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 

స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి

పరీక్షకు 8.49 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా.. దాదాపు 6 49 లక్షల మందికి పైగా హాజరయ్యారు. వీరిలో JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 5158 మంది క్వాలిఫై కాగా, అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD అడ్మిషన్ కు 48,161 మంది, కేవలం పీహెచ్ డీ కోసం 1,14,445 మంది అర్హత సాధించారు.

సబ్జెక్టుల వారీగా కటాఫ్ మార్కుల కోసం క్లిక్ చేయండి