UGC NET 2024 : యూజీసీ నెట్‌ పరీక్ష తేదీలు మార్పు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

UGC NET 2024 : యూజీసీ నెట్‌ పరీక్ష తేదీలు మార్పు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

యూజీసీ నెట్‌ 2024 (డిసెంబర్‌) పరీక్ష షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది.

Eenadu icon
By Education News Team Published :20 Dec 2024 16:11 IST

దిల్లీ: యూజీసీ -నెట్‌(UGC-NET) డిసెంబర్‌ 2024 పరీక్ష షెడ్యూల్‌లో ఎన్‌టీఏ(NTA) మార్పు చేసింది. ఈ పరీక్షలు 2025 జనవరి 3 నుంచి 16వరకు జరుగుతాయని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భంలో జనవరి 1 నుంచి 19వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను  డిసెంబర్‌ 11వరకు దరఖాస్తులు స్వీకరించారు. యూజీసీ నెట్‌ పరీక్ష పూర్తి షెడ్యూల్‌ కోసం క్లిక్‌ చేయండి

మొత్తం 85 సబ్జెక్టుల్లో జరిగే ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT)కు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు ఎగ్జామ్‌కు ఎనిమిది రోజుల ముందుగా విడుదల చేస్తామని ఎన్టీఏ తెలిపింది. ఏవైనా సందేహాలున్నా, ఎప్పటికప్పడు అప్‌డేట్‌ల కోసం తమ అధికారిక తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.