UGC NET 2024: యూజీసీ నెట్‌ (డిసెంబర్‌)కు దరఖాస్తులు షురూ.. పరీక్ష తేదీలివే..

UGC NET 2024: యూజీసీ నెట్‌ (డిసెంబర్‌)కు దరఖాస్తులు షురూ.. పరీక్ష తేదీలివే..

యూజీసీ నెట్‌ 2024 (డిసెంబర్‌) పరీక్షకు దరఖాస్తులు మొదలయ్యాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Published :20 Sep 2024 15:30 IST

దిల్లీ: యూజీసీ -నెట్‌(UGC-NET) డిసెంబర్‌ 2024 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను 2025 జనవరి 1 నుంచి 19వరకు నిర్వహించనున్నట్టు జాతీయ పరీక్షల సంస్థ (NTA) వెల్లడించింది. మొత్తం 85 సబ్జెక్టుల్లో జరిగే ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 19 నుంచి డిసెంబర్‌ 10 రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, పరీక్ష రుసుమును డిసెంబర్‌ 11 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చని NTA పేర్కొంది. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే డిసెంబర్‌ 11 వరకు సరి చేసుకోవచ్చు.

కంపెనీలే మీవైపు చూసేలా.. ఈ స్కిల్స్‌ నేర్చుకున్నారా?

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్ చేయండి

పరీక్ష కేంద్రాలు, అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌కు సంబంధించిన వివరాలను తర్వాత ప్రకటిస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది. మొత్తం 85 సబ్జెక్టుల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుం జనరల్‌/అన్‌రిజర్వుడు రూ.1150, జనరల్‌ (ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులైతే రూ.325 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 011-40759000/011-69227700, ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చని సూచించింది.