TG TET Schedule | జనవరి 2 నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2024-25) పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది.
By Education News Team
Published :18 Dec 2024 17:32 IST
https://results.eenadu.net/news.aspx?newsid=18122024
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2024-25) పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2 నుంచి 20వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు జనవరి 1 నుంచి 20 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా జనవరి 2 నుంచి 20వరకు సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్ 1 పరీక్షలు; జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.ఉదయం 9గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్; మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. నవంబర్ 7 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించగా దాదాపు 2.75 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
సబ్జెక్టుల వారీగా టెట్ సిలబస్ కోసం క్లిక్ చేయండి