JEE Main 2025 | జేఈఈ (మెయిన్) అడ్మిట్ కార్డులు విడుదల
        
        జనవరి 22న మొదలైన జేఈఈ మెయిన్ పరీక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా జనవరి 28, 29, 30 తేదీల్లో పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచారు.
     
    
    
   
     
    
      By Education News Team
      Updated  :23 Jan 2025 22:03 IST
      
    
     
        
            
            
            
                
                
                
                    https://results.eenadu.net/news.aspx?newsid=18012025
                    
                 
             
            
            
            
         
        
     
    
    JEE Main 2025 | ఇంటర్నెట్ డెస్క్:  దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనవరి 22న మొదలైన ఈ పరీక్షలు 30వరకు కొనసాగనున్నాయి. అయితే, ఇటీవల జనవరి 22, 23, 24 తేదీల్లో పరీక్షకు అడ్మిట్ కార్డుల్ని విడుదల చేసిన ఎన్టీఏ.. తాజాగా మిగతా రోజుల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డుల్ని  అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ నెల 28 , 29, 30 తేదీల్లో  జేఈఈ మెయిన్ (JEE Main 2025) సెషన్- 1 పరీక్షలు రాయాల్సి ఉన్న విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డుల్ని (JEE Main Admit Cards) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
దేశ వ్యాప్తంగా పలు నగరాలు/ పట్టణాలతో పాటు విదేశాల్లోని 15 నగరాల్లో  జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 28, 29 తేదీల్లో పేపర్ -1 (బీఈ/బీటెక్) రెండు షిఫ్టుల్లో (ఉదయం షిఫ్టు ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు; రెండో షిఫ్టు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు) జరగనుంది. అలాగే, జనవరి 30న పేపర్ -2ఎ (బీ.ఆర్క్) పేపర్ 2బి (బి.ప్లానింగ్),  పేపర్ 2ఎ, 2బీ (బీఆర్క్, బి.ప్లానింగ్)కు సంబంధించిన పరీక్ష రెండో షిఫ్టులో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6/ సాయంత్రం 6.30గంటల వరకు ఈ పరీక్ష ఉంటుందని ఎన్టీఏ ఓ ప్రకటనలో తెలిపింది.
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు చేసిన విజ్ఞాపనల మేరకు ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్ రాజ్‌లో పరీక్ష కేంద్రాలను సమీపంలోని నగరమైన వారణికి మార్పు చేయాలని నిర్ణయించింది.  అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులు 011-40759000 నంబర్, jeemain@nta.nic.inకు ఈ -మెయిల్ ద్వారా సంప్రదించ్చవచ్చని ఎన్టీఏ సూచించింది.