CBSE Exams rescheduled| సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షల షెడ్యూల్‌లో మార్పు.. ఈ పరీక్షల తేదీలు మారాయ్‌..

CBSE Exams rescheduled| సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షల షెడ్యూల్‌లో మార్పు.. ఈ పరీక్షల తేదీలు మారాయ్‌..

సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌(CBSE Exams rescheduled)లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.

Eenadu icon
By Education News Team Updated :30 Dec 2025 17:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌(CBSE Exams rescheduled)లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. టెన్త్‌, 12 తరగతుల విద్యార్థులకు మార్చి 3న జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ (CBSE) ప్రకటించింది. పాలనాపరమైన కారణాలతో ఈ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు పేర్కొంది. మార్చి 3వ తేదీన టెన్త్‌ విద్యార్థులకు జరగాల్సిన పరీక్షను మార్చి 11వ తేదీకి; 12వ తరగతి విద్యార్థులకు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్‌ 10కి మార్పు చేస్తూ నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. ఇతర పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని తెలిపింది. 

ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 3న పదో తరగతి విద్యార్థులకు టిబెటన్‌, జర్మన్‌, నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌, జపనీస్‌, స్పానిష్‌, మిజో, కశ్మీరీ, ఎలిమెంట్స్‌ ఆఫ్ బుక్‌ కీపింగ్ అండ్‌ అకౌంటెన్సీ వంటి పరీక్షలు జరగాల్సి ఉండగా.. 12వ తరగతి విద్యార్థులకు లీగల్‌ స్టడీస్‌ పరీక్ష జరగాల్సి ఉంది. తాజాగా చోటుచేసుకున్న మార్పుతో మార్చి 3న పదో తరగతి విద్యార్థులకు జరగాల్సిన ఆయా పరీక్షలు మార్చి 11న; 12వ తరగతి విద్యార్థులకు జరగాల్సిన పరీక్ష ఏప్రిల్‌ 10న నిర్వహించనున్నారు.  విద్యార్థులకు ప్రిపరేషన్‌లో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా వీలైనంత త్వరగా ఈ సమాచారాన్ని తెలియజేయాలని పాఠశాలలను బోర్డు కోరింది. విద్యార్థులు ఈ రివైజ్‌ చేసిన తేదీలను గమనించి తదనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలని సూచించింది. 

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే.. (పాతది)