10th Exams Preparation | టెన్త్‌ విద్యార్థులూ.. పరీక్షల ప్రిపరేషన్‌కు నిపుణుల 10 సూచనలివే!

10th Exams Preparation | టెన్త్‌ విద్యార్థులూ.. పరీక్షల ప్రిపరేషన్‌కు నిపుణుల 10 సూచనలివే!

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు గడువు దగ్గరపడుతోంది. విద్యార్థులు ఇప్పట్నుంచైనా సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ కొనసాగిస్తే మంచి స్కోరు సాధించొచ్చంటున్నారు నిపుణులు.

Eenadu icon
By Education News Team Updated :30 Dec 2025 16:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షల(10th Class Exams)కు గడువు దగ్గరపడుతోంది. విద్యార్థులు ఇప్పట్నుంచైనా సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ కొనసాగిస్తే మంచి స్కోరు సాధించొచ్చంటున్నారు నిపుణులు. సీబీఎస్‌ఈ(CBSE) టెన్త్‌ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానుండగా.. తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు టెన్త్‌ పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16వరకు; ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెరుగైన మార్కులతో విద్యార్థులు రాణించేందుకు నిపుణులు చేస్తున్న కొన్ని సూచనలివే..

1. రోజూ ఉదయాన్నే నిద్ర లేచి చదవడం ఉత్తమం. ఈ సమయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఫోకస్‌ పెరుగుతుంది.

2. సబ్జెక్టు ఏదైనా.. రెండు మూడు భాగాలుగా విభజించుకొని చదవడం వల్ల ప్రిపరేషన్‌ ఒత్తిడి లేకుండా సాగుతుంది. 

3. మీ పరీక్షకు ఉన్న గడువు ఆధారంగా రివిజన్‌కు కొంత సమయం కేటాయించి మిగిలిన పాఠ్యాంశాలనూ చదివేలా ఇప్పట్నుంచే తగిన ప్లాన్‌ వేసుకోండి. 

4. రోజూ 20 నిమిషాల పాటు ధ్యానం వంటివి చేయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. 

5. కూర్చున్న చోటే పుస్తకం పట్టుకొని అలా ఉండిపోకుండా చిన్న చిన్న బ్రేక్‌లు తీసుకోండి.

6. మోడల్‌ పేపర్లను సాల్వ్‌ చేయడంతో పాటు గత కొన్నేళ్ల పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలనూ సాధన చేయండి. 

7. వెయిటేజీ ఎక్కువగా ఉన్న చాప్టర్లను ముందుగా పూర్తి చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. 

8. మీరు చదివిన ప్రశ్నలకు చూడకుండా జవాబులు రాయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల పరీక్ష సమయంలో త్వరగా రాసే నైపుణ్యం అలవడుతుంది. 

9. బిట్ పేపర్‌పైనా నిర్లక్ష్యం చూపొద్దు. ఏదైనా పాఠ్యాంశాలపై సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోండి.

10. ఉన్న కొద్ది సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్లాన్‌ చేసుకోండి. మంచి ఆహారం, తగినంత నిద్ర ఉండేలా తగిన జాగ్రత్తలు వహించండి.