NEET 2025 Syllabus | నీట్‌ (యూజీ)- 2025 సిలబస్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

NEET 2025 Syllabus | నీట్‌ (యూజీ)- 2025 సిలబస్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో యూజీ ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష (NEET 2025)కు సిలబస్‌ విడుదలైంది.

Eenadu icon
By Education News Team Published :17 Dec 2024 18:27 IST

NEET 2025 syllabus| ఇంటర్నెట్ డెస్క్‌: దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో యూజీ ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష(NEET 2025)కు సిలబస్‌ ఖరారైంది. ఈ సిలబస్‌ను జాతీయ వైద్య కమిషన్‌ (NMC) అధికారికంగా విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ పరీక్ష సిలబస్‌ను ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల వారీగా పీడీఎఫ్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

సిలబస్‌ కోసం క్లిక్‌ చేయండి

మరోవైపు, ఈసారి కూడా నీట్‌ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలోనే నిర్వహిస్తారా? లేదంటే ఆన్‌లైన్‌లోనా (CBT) అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభలో వెల్లడించారు.