UPSC CSE Main Results: యూపీఎస్సీ సివిల్స్ (మెయిన్) పరీక్ష ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు వీరే..!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Published :09 Dec 2024 20:05 IST
https://results.eenadu.net/news.aspx?newsid=101224
UPSC CSE Main Exam Results| దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్ పరీక్షలు జరగ్గా.. ఈ ఫలితాలను UPSC సోమవారం సాయంత్రం విడుదల చేసింది. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది.
ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మెయిన్ పరీక్షలు నిర్వహించిన అధికారులు.. తాజాగా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. త్వరలో నిర్వహించే ఇంటర్వ్యూలో సత్తా చాటిన వారిని ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర (గ్రూప్ ఏ, గ్రూప్ బి) సర్వీసులకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి.