AP Inter Supplementary Hall Tickets | ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు(AP Inter Advanced Supplimentary Halltickets 2025) విడుదలయ్యాయి.
By Education News Team
Published :06 May 2025 14:56 IST
https://results.eenadu.net/news.aspx?newsid=06052015-ap-inter-supplementary-hall-tickets
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు(AP Inter Advanced Supplimentary Halltickets 2025) విడుదలయ్యాయి. మే 12 నుంచి 20వ తేదీ వరకు ప్రథమ ఇంటర్, ద్వితీయ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటలవరకు ప్రథమ ఇంటర్, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నంబర్/గత హాల్‌టికెట్ నంబర్ (ద్వితీయ ఇంటర్ విద్యార్థులైతే)తో పాటు పుట్టిన తేదీ లేదా విద్యార్థి పూర్తి పేరు, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి హాల్‌టికెట్లు పొందొచ్చు.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి