CBSE Class 10, 12 Results 2025 | సీబీఎస్‌ఈ టెన్త్, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు? ఎలా చెక్ చేసుకోవాలి?
దేశ వ్యాప్తంగా దాదాపు 42లక్షల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
By Education News Team
Published :29 Apr 2025 15:00 IST
https://results.eenadu.net/news.aspx?newsid=29042025
CBSE Class 10, 12 Results | ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా దాదాపు 42లక్షల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 మధ్య జరిగిన ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ట్రెండ్స్‌ని బట్టి చూస్తే ఈసారి మే నెల మధ్య నాటికి CBSE Class 10, 12 Results విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. 2024లో మే 13న ఫలితాలు విడుదల కాగా.. 2023లో అయితే, మే 12వ తేదీనే ఫలితాలు వెల్లడించారు.
ఎక్కడ చెక్ చేసుకోవాలి?
విద్యార్థులు తమ ఫలితాలను cbse.gov.in, cbseresults.nic.in, results.cbse.nic.in, results.digilocker.gov.in, umang.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా పొందొచ్చు. అలాగే, ఈ ఫలితాలు విడుదలైన తర్వాత results.eenadu.netలోనూ అందుబాటులో ఉంటాయి.
ఎలా చెక్ చేసుకోవాలి?
- తొలుత సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ results.cbse.nic.inను సందర్శించండి.
- సీబీఎస్‌ఈ 10వ తరగతి లేదా 12వ తరగతి ఫలితాలను ఎంచుకోవాలి.
- విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.
- ఫలితాలకు సంబంధించిన కాపీని ప్రింట్ తీసి దాచిపెట్టుకోండి.