Job Recruitment | ఎయిమ్స్‌లో 199 ఉద్యోగాలు.. నెలకు రూ.2లక్షలకు పైనే వేతనం!

Job Recruitment | ఎయిమ్స్‌లో 199 ఉద్యోగాలు.. నెలకు రూ.2లక్షలకు పైనే వేతనం!

దిల్లీలోని ఎయిమ్స్‌కు సంబంధించిన క్యాంపస్‌లో బోధనా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది.

Eenadu icon
By Education News Team Published :06 Apr 2025 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఆస్పత్రి ఎయిమ్స్‌(Delhi AIIMS)లో పెద్ద సంఖ్యలో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.  మొత్తం 199 ఉద్యోగ ఖాళీలకు ఏప్రిల్‌ 10 నుంచి మే 9వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు రుసుంను జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.3వేలు, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ/ఎస్టీలకు రూ.2400 చొప్పున నిర్ణయించారు.

ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల దరఖాస్తు రుసుం రిఫండ్‌ చేస్తారు. దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం నుంచి మినహాయింపు కల్పించారు. ఈ పోస్టులన్నింటికీ అభ్యర్థుల వయస్సు 50 ఏళ్లకు మించరాదు. పూర్తి వివరాలను ఎయిమ్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

పోస్టులను బట్టి వేతనాలు ఇలా.. 

  • ప్రొఫెసర్‌: రూ.1,68,900 - రూ.2,20,400
  • అడిషినల్‌ ప్రొఫెసర్‌: రూ.1,48,200 - రూ.2,11,400
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రూ.1,380,300 - రూ. 2,09,200
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రూ.1,01,500 - రూ. 1, 67,400

ఉద్యోగ ఖాళీల వివరాలు, విద్యార్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తుకు వర్గాల వారీగా వయో పరిమితి సడలింపు, ఇతర నిబంధనలు.. పూర్తి నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. 

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి