JEE (Main) 2025 Key : జేఈఈ (మెయిన్) పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల
JEE Main 2025 paper-1 Answer Key: జేఈఈ (మెయిన్) పరీక్ష పేపర్ -1 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి.
By Education News Team
Published :04 Feb 2024 19:29 IST
https://results.eenadu.net/news.aspx?newsid=04022025
JEE (Main) 2025 Key | దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ (మెయిన్) తొలి విడత పరీక్ష ప్రిలిమినరీ కీ (JEE Main 2025 Preliminary Key) విడుదలైంది. జనవరి 22 నుంచి 29వరకు నిర్వహించిన పేపర్- 1 ప్రాథమిక ఆన్షర్ కీలు, రెస్పాన్స్ షీట్లను ఎన్టీఎ (NTA) మంగళవారం సాయంత్రం విడుదల చేసింది.ఈ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు తెలపవచ్చని అభ్యర్థులకు సూచించింది.
కీ, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి
జేఈఈ మెయిన్ (JEE Main 2025) పేపర్ 1 కీ కోసం అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున (నాన్ రిఫండబుల్) చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది కీ, ఫలితాలను వెల్లడిస్తారు. ఈ కీ, రెస్పాన్స్ షీట్‌లను పరిశీలించి బేరీజు వేసుకోని విద్యార్థులు తమ స్కోరును అంచనా వేసుకోవచ్చు. ఫిబ్రవరి 12 నాటికి జేఈఈ (మెయిన్) ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.