CTET 2024 Key | సీటెట్ కీ, ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..
కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET Exam-DEC 2024) ఆన్సర్ కీ విడుదలైంది.
By Education News Team
Published : 02 Jan 2025 16:59 IST
https://results.eenadu.net/news.aspx?newsid=02012025
CTET 2024 Key Released | దిల్లీ: కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET Exam-DEC 2024) ఆన్సర్ కీ విడుదలైంది. గత నెలలో దేశవ్యాప్తంగా సీటెట్ పరీక్షలు జరగ్గా.. అభ్యర్థుల ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు, కీని అధికారులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. జనవరి 1 నుంచి 5వ తేదీ అర్ధరాత్రి 11.59గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్సర్ కీల పట్ల ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈలోగా ఒక్కో ప్రశ్నకు రూ.1000 చొప్పున (నాన్-రిఫండ్) అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
సీటెట్ కీ కోసం క్లిక్ చేయండి
ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు నిజమని తేలితే వారు చెల్లించిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. త్వరలోనే సీటెట్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఆన్సర్ కీ డౌన్‌లోడ్ కోసం అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ నిర్వహించే ఈ పరీక్షలో సాధించిన స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.