TG EAPCET-2025 Preliminary Key | తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. రెస్పాన్స్‌ షీట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

TG EAPCET-2025 Preliminary Key | తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. రెస్పాన్స్‌ షీట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం ‌ప్రిలిమినరీ కీని అధికారులు విడుదల చేశారు.

Eenadu icon
By Education News Team Published :05 May 2025 17:01 IST

TG EAPCET-2025 Preliminary Key | ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం ‌ప్రిలిమినరీ కీ విడుదలైంది. నిన్న ఎప్‌సెట్‌ అగ్రికల్చర్‌ - ఫార్మసీ విభాగం ప్రాథమిక కీని  విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కు సంబంధించిన ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌ను డౌన్‌లోడ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మే 7వ తేదీ  సాయంత్రం 5గంటల వరకు తమ అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in/ ద్వారా తెలపవచ్చని సూచించారు. మే 2 నుంచి 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు జరగ్గా.. 2,07,190 మంది విద్యార్థులు హాజరయ్యారు. 

రెస్పాన్స్‌ షీట్‌ కోసం క్లిక్‌ చేయండి

కీ, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి

మరోవైపు, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగం ఎప్‌సెట్ ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో జరగ్గా.. మే 4న ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ క్వశ్చన్‌పేపర్‌ను విడుదల చేశారు. కీ పట్ల అభ్యంతరాలు తెలిపేందుకు మే 6 మధ్యాహ్నం 12గంటల వరకు గడువు ఇచ్చారు.  అగ్రికల్చర్‌ విభాగం పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా  81,198మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.