JEE Main 2025 Admit cards | జేఈఈ (మెయిన్) సెషన్-2 అడ్మిట్ కార్డులు విడుదల
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్న జేఈఈ (మెయిన్) సెషన్-2 ఆన్‌లైన్ పరీక్షలకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.
By Education News Team
Published :29 Mar 2025 11:45 IST
https://results.eenadu.net/news.aspx?newsid=jee-main-2025-admit-cards
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్న జేఈఈ (మెయిన్) సెషన్-2 ఆన్‌లైన్ పరీక్షలకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ కార్డులను జాతీయ పరీక్షల సంస్థ (NTA) డౌన్‌లోడ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో జరిగే పరీక్షలకు మాత్రమే ప్రస్తుతం అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ కోసం వుంచింది. ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో జరిగే పరీక్షలకు అడ్మిట్ కార్డులు తర్వాత జారీ చేస్తారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు పొందొచ్చు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
పేపర్ -1 (బీఈ/బీటెక్) పరీక్ష.. ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు షిఫ్టుల్లో; 8వ తేదీన రెండో షిఫ్టులో నిర్వహించనున్నారు. అలాగే, ఏప్రిల్ 9న పేపర్ 2ఏ (బీఆర్క్), పేపర్-2బి (బి.ప్లానింగ్) పేపర్ 2ఎ, బి(బీఆర్క్, బి.ప్లానింగ్) పరీక్ష ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరగనుంది. దేశవ్యాప్తంగా పలు నగరాలతో పాటు విదేశాల్లోని 15 నగరాల్లో జేఈఈ (మెయిన్) సెషన్-2 పరీక్షలు నిర్వహించేందుకు ఎన్‌టీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసిన అధికారులు.. తాజాగా అడ్మిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు.