AP SET 2025 | ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. సబ్జెక్టుల వారీగా సిలబస్ ఇదిగో!
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత కోసం నిర్వహించే ఏపీ సెట్-2025 (AP SET 2025)కు నోటిఫికేషన్ విడుదలైంది.
By Education News Team
Updated :31 Dec 2025 17:35 IST
https://results.eenadu.net/news.aspx?newsid=31122025apset
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల అర్హతకు నిర్వహించే ఏపీ సెట్-2025 (AP SET 2025)కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో 2026 మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆంధ్రా యూనివర్సిటీ వెల్లడించింది. ఇందుకోసం జనవరి 9 నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు పేర్కొంది. ఈ పరీక్షకు దరఖాస్తు రుసుం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1600, బీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులైతే రూ.1300, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.900 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. ఏపీ సెట్ దరఖాస్తుకు అర్హతలు, సిలబస్ తదితర వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.
సబ్జెక్టుల వారీగా సిలబస్ కోసం క్లిక్ చేయండి