TG Engineering 2nd phase seat allotment | ఇంజినీరింగ్‌ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి.. తుది విడత కౌన్సెలింగ్‌ ఎప్పుడంటే?

ఇంజినీరింగ్‌ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి.. తుది విడత కౌన్సెలింగ్‌ ఎప్పుడంటే?

తెలంగాణలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. పూర్తి వివరాలివే..

Published :31 July 2024 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. ఈ మేరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థుల ర్యాంకులకు అనుగుణంగా సీట్ల కేటాయింపు ప్రక్రియను ఉన్నత విద్యామండలి అధికారులు పూర్తి చేశారు. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండో విడతకు ఎంపికైన వారు ట్యూషన్‌ ఫీజు పేమెంట్‌, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు ఆగస్టు 1 నుంచి 2వ తేదీ వరకు గడువు ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ విద్యాసంస్థలు ఉండగా.. మొత్తం 86, 509 ఇంజినీరింగ్ సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. వీటిలో రెండు రౌండ్లలో కలిపి 81,490 సీట్ల ( 94.20 శాతం) కేటాయింపు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా 5,019 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఈఏపీసెట్‌ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. అయితే, కౌన్సెలింగ్‌ ద్వారా బీటెక్‌ సీట్లు పొందిన విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యాకే స్వయంగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. దీంతో ఇంతకముందు ప్రకటించిన మాదిరిగా రెండో విడత సీట్ల కేటయింపు తర్వాత రిపోర్టు చేయవద్దని ఎప్‌సెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు. దీంతో కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు తుది విడత కౌన్సెలింగ్‌  ప్రక్రియ పూర్తయ్యాకే కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

తుది విడతకు సంబంధించిన షెడ్యూల్‌ ఇదే..