AP ICET, AP ECET rank cards download I ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ర్యాంక్‌ కార్డుల డౌన్‌లోడ్‌ ఇలా.. క్లిక్‌ చేయండి

ICET Rank Cards: ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ర్యాంక్‌ కార్డుల డౌన్‌లోడ్‌ ఇలా.. క్లిక్‌ చేయండి

ఏపీలో ఐసెట్‌, ఈసెట్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన అధికారులు.. అభ్యర్థుల ర్యాంక్‌ కార్డుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

Published : 30 May 2024 17:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలో ఐసెట్‌ (AP ICET), ఈసెట్‌ ఫలితాలు (AP ECET Results) విడుదలయ్యాయి. ఈసెట్‌ ఫలితాలను గురువారం (మే 30న) ఉదయం 11గంటలకు; ఐసెట్‌ ఫలితాలను సాయంత్రం 4గంటలకు విడుదల చేసిన అధికారులు.. ర్యాంక్‌ కార్డుల్ని సైతం డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉంచారు. ఈ కింద  ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేసి అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ర్యాంక్‌ కార్డుల్నిపొందొచ్చు. 

ఐసెట్‌ ర్యాంక్‌ కార్డుల కోసం క్లిక్ చేయండి

ఈసెట్‌ ర్యాంక్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 6న ఏపీ ఐసెట్‌ పరీక్ష నిర్వహించగా.. దాదాపు 45వేల మంది రాశారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం మే 8న నిర్వహించిన ఏపీ ఈసెట్‌  పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 36,369మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐసెట్‌లో 96.71శాతం, ఈసెట్‌లో 90.41శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.