ICAI CA inter Results I సీఏ ఇంటర్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలు విడుదల.. టాపర్లు వీరే..
ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) ఇంటర్, ఫౌండేషన్ (ICAI CA Foundation) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
Published :30 Oct 2024 15:09 IST
https://results.eenadu.net/news.aspx?newsid=30102024
ICAI CA inter Results | దిల్లీ: ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) ఇంటర్, ఫౌండేషన్ (ICAI CA Foundation) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) సంస్థ బుధవారం ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ icai.nic.inలో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆరు అంకెల రోల్ నంబర్‌తో పాటు రిజిస్ట్రేషన్ నంబర్, అక్కడ కనిపించే కోడ్‌ను ఎంటర్ చేయాల్సిఉంటుంది.
పుస్తకం పట్టుకోగానే నిద్ర ముంచుకొస్తోందా? 10 చిట్కాలు ఇవిగో!
సీఏ ఇంటర్‌లో టాపర్లు వీరే.. ఉత్తీర్ణత శాతం ఇలా..
సీఏ ఇంటర్‌లో 80.87శాతం స్కోరుతో ముంబయికి చెందిన పరమి ఉమేశ్ పరేఖీ తొలి ర్యాంకులో మెరిశారు. చెన్నైకి చెందిన తన్య గుప్తా (80.67శాతం) రెండో స్థానంలో నిలవగా.. విధి జైన్ 73.0శాతం స్కోరుతో మూడో స్థానంలో నిలిచారు. దేశ వ్యాప్తంగా 459 సెంటర్లలో జరిగిన సీఏ ఇంటర్ పరీక్షలకు మొత్తంగా 1,39,646 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో గ్రూపు- 1 విభాగంలో 69,227మంది హాజరు కాగా.. కేవలం 10,505మంది క్వాలిఫై అయ్యారు. ఉత్తీర్ణత శాతం 15.17శాతంగా ఉంది. అలాగే, గ్రూపు -2 విభాగానికి సంబంధించిన పరీక్షకు 50,760మంది విద్యార్థులు హాజరు కాగా.. కేవలం 8,117 మంది మాత్రమే (15.99%) ఉత్తీర్ణత సాధించారు. ఈ రెండు గ్రూపులు కలిపి 23,482మంది విద్యార్థులు రాయగా.. వీరిలో కేవలం 1330 మంది (5.66శాతం)మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఇకపోతే, సీఏ ఫౌండేషన్ పరీక్షలకు 78,209మంది హాజరు కాగా.. 19.67శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.