GATE 2025 Mock Tests | ఫిబ్రవరి 1 నుంచే గేట్ 2025 పరీక్షలు.. మాక్ టెస్టులు ఇవిగో!
గేట్ 2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి 16 మధ్య వివిధ తేదీల్లో జరిగే ఈ పరీక్షకు సంబంధించిన మాక్ టెస్టులు ఇవిగో..
By Education News Team
Published :30 Jan 2025 18:43 IST
https://results.eenadu.net/news.aspx?newsid=30012025
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2025) పరీక్షకు ఐఐటీ రూర్కీ(IIT Roorkee) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 16వరకు జరిగే ఈ పరీక్షలకు ఇప్పటికే అడ్మిట్ కార్డుల్ని విడుదల చేసింది. ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యే ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు చివరి సారిగా తమ సన్నద్ధతను పరీక్షించుకొనేందుకు గేట్ 2025 వెబ్‌సైట్‌లో మాక్ టెస్టులను ప్రయత్నించొచ్చు.
గేట్ మాక్ టెస్ట్‌ల కోసం క్లిక్ చేయండి
సబ్జెక్టుల వారీగా అందుబాటులో ఉన్న ఈ మాక్ టెస్టులను విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న వాటిపై క్లిక్ చేసి రాయొచ్చు. ఈ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులకు ఈ పరీక్ష ప్యాటర్న్ తెలియడంతో పాటు నిర్ణీత సమయంలో సమాధానాలు రాయడం పూర్తి చేసే నైపుణ్యం మెరుగుపడుతుంది. ప్రశ్నపత్రంపై అవగాహన ఏర్పడటంతో పాటు పరీక్ష రాసేటప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో ఉండేలా తోడ్పడుతుంది తొలిసారి ఈ పరీక్ష రాసే అభ్యర్థులు ప్రశ్నపత్రంలో ఏ రకమైన ప్రశ్నలు ఉంటాయో వివరంగా పరిశీలించే అవకాశం కలుగుతుంది.